రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈహెచ్‌ఎస్ కొత్త నిబంధనల ప్రకారం నెట్‌వర్క్ హాస్పిటళ్లలో కేవలం ఇన్‌పేషెంట్ సేవలు, వెల్‌నెస్ సెంటర్లలో మాత్రమే ఓపీ సేవలు అందించాల్సి ఉంది. అయితే ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిమ్స్ ఆస్పత్రిలో మాత్రం ఉచిత ఓపీ సేవలను యథావిధిగా కొనసాగించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.