మునుబోలు పోర్టు అడ్డరోడ్డు పై వంతెనపై శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి నుంచి విజయవాడ వెళుతున్న వెంకటరమణ ట్రావెల్స్ బస్సు పోర్టు రోడ్డు సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు.