మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జాతీయ మహిళా రెజ్లర్ అయిన అశ్వని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వంద అడుగుల లోతైన నల్ దుర్గ్ కోటపై నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకుంది. కొన్ని రోజులుగా.. అశ్వినిని ఆమె భర్త, అత్తమామలు నిరంతరం మానసికంగానూ, శారీరకంగానూ వేధిస్తుండటంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైంది. ఇక తన జీవితంను ముగించు కుంటానని, పిల్లలు అనాథలామారకూడదని తనతో పాటు తీసుకెళ్లాలని భావించి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడింది.