రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ రాజకీయాల్లో ఎవరూ సాధించని అరుదైన ఘనతను ఆ దేశ తొలి మహిళా ప్రధాని జార్జియా మెలోని సొంతం చేసుకున్నారు. వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న నాయకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. అతిపెద్ద రాజకీయ అస్థిరతకు మారుపేరైన ఇటలీలో ఒక ప్రభుత్వం ఇన్ని రోజులు స్థిరంగా కొనసాగడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇటలీ ఇమేజ్‌ను పెంచారు. ట్రంప్‌తో సహా అనేక మంది ప్రపంచ నేతలతో ఆమె మంచి మైత్రిని కొనసాగిస్తున్నారు.