తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని. అలాగే కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని, దక్షికోస్తా, రాయలసీమలో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది.