సోనూసూద్ ఇప్పుడు తన బృందంతో కలిసి నేరుగా ఖాట్మండుకు వెళ్లి వరద బాధితులకు ఆహారం, దుప్పట్లు ఇతర నిత్యావసరాలను అందిస్తూ వారి కన్నీటిని తుడిచే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసిన కొందరు సోనూ సూద్ పై సెల్ఫ్ మార్కెటింగ్ కోసమే ఇలా చేస్తున్నారంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. సదరు నెటిజన్ కు ఇలా రిప్లై ఇచ్చారు..‘‘సోదరా.. మీరు చాలా మంచి వారు. నేపాల్‌కు రండి. మనమిద్దరం కలిసి అక్కడి ప్రజలకు సహాయం చేద్దాం’ అని పిలుపునిచ్చారు సోనూసూద్.