కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ జీవిత చరిత్ర ప్రచురణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ఇండియా ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సోనియా గాంధీ జీవిత చరిత్ర బుక్ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ (Belonging: A Journey of Love). ఈ ఆత్మకథను ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు కూడా హార్పర్ కాలిన్స్ వెల్లడించింది.