కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమైన నామినేటెడ్ పదవుల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించింది. బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాన్ని ఇస్తూ ప్రభుత్వం ఈ నియామకాలు చేపట్టింది. గద్వాల విజయలక్ష్మి, నేరెళ్ల శారద, గుండు సుధారాణిలను కీలక పదవుల్లో నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.