శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నవీ ముంబై నుంచి శ్రీనగర్‌కు వచ్చిన ఇండిగో ఫ్లైట్ పార్కింగ్ బేకు వెళ్తుండగా VDGS స్తంభాన్ని ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం సుమారు 9గంటల సమయంలో బే నంబర్ 6 వద్ద ఈ ఘటన జరిగినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు విమానం పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం తీవ్రతపై, విమానం దెబ్బతిన్న ఖచ్చితమైన భాగాలపై పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. నంతరం ప్రయాణికులు, సిబ్బందిని సాధారణ మెట్ల సహాయంతో విమానం నుంచి సురక్షితంగా దించారు.