దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ Adobe నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన అనిల్ చక్రవర్తి అడోబ్ కొత్త ప్రెసిడెంట్ మరియు సీఈవో (CEO) గా నియమితులయ్యారు. డిసెంబర్ 1న అనిల్ చక్రవర్తి అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు అనిల్ చక్రవర్తి ఐఐటీ బనారస్ హిందూ యూనివర్సిటీ (IIT-BHU) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని ప్రతిష్టాత్మక ఎంఐటీ (MIT) నుంచి ఎంఎస్ మరియు పీహెచ్‌డీ పట్టాలు పొందారు.