కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. జుక్కల్ చౌరస్తా సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బిచ్కుంద వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ప్రయాణిస్తూ అదుపు తప్పి రక్షణ గోడను బలంగా ఢీకొట్టిన అనంతరం బోల్తా పడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.