ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. దీనికి సంబంధించి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రధాన కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ఈ వార్డుల పునర్విభజనను చేపట్టనున్నారని సమాచారం. ఈ ప్రతిపాదనలపై రేపటి నుంచి 7 రోజుల పాటు (ఈ నెల 11వ తేదీ వరకు) ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు పురపాలక శాఖ తెలిపింది.