హైదరాబాద్లోని మాంస విక్రయదారులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక సూచనలు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని 04 సెప్టెంబర్ 2026న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. మాంసం, బీఫ్ దుకాణాల మూసివేతను సమర్థవంతంగా అమలు చేయడంలో మున్సిపల్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను కోరారు.