కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పంపించిన ఫైల్ పై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సంతకం చేశారు. తనను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుటే గవర్నర్ సంతకం చేయడం గమనార్హం. రాష్ట్ర మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తూ..అధికారిక ప్రక్రియ పూర్తయినట్లయింది. దీంతో ఇక ఆమె మాజీ మంత్రిగా మారిపోయారు. రాజీనామా చేసేందుకు కొండా సురేఖ ససేమిరా అన్నారు. దీంతో మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.