కొండా సురేఖతో పాటు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న చిన్నారెడ్డిపై వేటు పడిన విషయం తెలిసిందే. వేటు వేసిన కొద్ది గంటల్లోనే ఆయన పంటపొలాల్లో ప్రత్యక్షమయ్యారు. తనకు పదవులపై ఎలాంటి సోకు లేదని స్పష్టం చేశారు. పదవి లేకున్నా తనకు గౌరవం ఉందని అన్నారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నాటి నుంచి తాను పార్టీలో కొనసాగుతున్నానని అన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.