వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేసింది. దీంతో వార్డులు, డివిజన్ల పునర్విభజనను వ్యతిరేకిస్తూ దాఖ లైన 50 పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. వాటిని తోసిపుచ్చుతూ కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు డీలిమిటేషన్ ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజనకు లైన్ క్లియర్ అయినట్లయింది. హైకోర్టు తీర్పుతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వార్డుల ప్రకారం స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి.