టెట్ పాస్ కాకుండానే ఓ వ్యక్తికి టీచర్ ఉద్యోగం వచ్చింది. ప్రభాకర్ అనే వ్యక్తి టెట్ లేకుండా క్రీడా కోటాలో ఎస్ జిటి ఉద్యోగం పొందారు. ఫిర్యాదులు రావడంతో డిఇఒ సుధాకర్ విచారణ జరుపుతున్నారు. ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులు సిఫార్సు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం కౌతాళం మండలం వల్లూరు ఎలిమెంటరీ స్కూల్లో ప్రభాకర్ విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు మాత్రం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో గుర్తించలేకపోయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.