బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన కుమార్తె అలేఖ్య ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చూస్తుండగానే కాలం ఎంత వేగంగా సాగిపోయిందో, తన చిన్నారి బిడ్డ కాలేజీ స్థాయికి ఎదిగిపోయిందో తలచుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఇటీవల ఆమెను అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో జాయిన్ చేసిన కేటీఆర్, ప్రక్రియ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చిన అనంతరం తన భావాలను నెటిజన్లతో పంచుకున్నారు.