ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా, యూపీలో కీలక నేతగా ఉన్న సయ్యద్ అసిమ్ వకార్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిజెపి, దాని సిద్ధాంతాలను ఎదుర్కొంటామని ఎంఐఎం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల వంటి లౌకిక శక్తులకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని వకార్ ఆరోపించారు.