తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ఎలా చెప్పుకుంటారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన అనంతరం ఆమె మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఒక న్యాయం, ఇతరులకు ఇంకో న్యాయమా అని ఆమె నిలదీశారు.తనపై ఏమైనా చర్యలు తీసుకోవాలని చూస్తే రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై తిరగబడతారని కొండా సురేఖ హెచ్చరించారు.

