ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ 2026 ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారిక షెడ్యూల్ విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఆ తరువాత విద్యార్థులు తమ ప్రాధాన్యతను బట్టి వెబ్ ఆప్మెంట్లు నమోదు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పిస్తారు.