తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఇఒ మెండు లోకనాథం ఇంట్లో ఎసిబి దాడులు చేసింది. లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఎసిబి అధికారులు నమోదు చేశారు. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ఇంట్లో ముమ్మరంగా ఎసిబి సోదాలు చేపట్టింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి 5 చోట్ల ఎసిబి బృందాలు తనిఖీలు కొనసాగుతున్నాయి. లోకనాథం సోదరుడి నివాసంతో పాటు తిరుపతిలోని లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇండ్లు, తిరుమలలోని లోకనాథం ఆఫీసులో ఎసిబి తనిఖీలు చేపట్టింది.