హైదరాబాద్ లో గణేశ్ ఉత్సవాల వేళ కొత్త వివాదం రాజుకుంటోంది. తాము అభివృద్ధి చేసిన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతించబోమని హైడ్రా (HYDRAA) తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ సూచించిన చెరువులు, జల వనరుల్లో మాత్రమే నిమజ్జనం చేసుకోవాలని చెబుతోంది. దీనిపై గణేశ్ ఉత్సవ సమితి అభ్యంతరం చెబుతోంది. నిమజ్జనాన్ని అడ్డుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో ఎలా అయితే చేశామో.. ఇప్పుడు కూడా నిమజ్జన ప్రక్రియ అలాగే ఉంటుందని చెబుతోంది.