చంద్రబాబు తాను చేయని దానిని చెప్పుకోవడంపై వైఎస్ జగన్ ప్రశ్నించారు. వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలే. వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం. శిలాఫలకం మాత్రమే మీది… సంకల్పం, సమగ్ర నిర్మాణం వైయస్సార్ గారిది. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చుచేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క వాస్తవమే చెబుతోంది.