దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన ‘నీట్-పీజీ 2026’ ప్రవేశ పరీక్ష ఆదివారం ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా దాదాపు 2.65 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా పరీక్ష సజావుగా సాగినప్పటికీ, రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఒక పరీక్షా కేంద్రంలో మాత్రం విద్యుత్ సరఫరాలో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడింది. ఆ అభ్యర్థులందరికీ సెప్టెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేకంగా మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌బీఈఎంఎస్ స్పష్టం చేసింది.