నేపాల్ వరదల్లో 97 ఏళ్ల వృద్ధురాలు మృత్యువును జయించారు. నువాకోట్ జిల్లా టుపే ప్రాంతంలోని ఓ సంరక్షణ గృహంలో గుణ మాయా బొహారా అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదల్లో ఆమె ఉంటున్న భవనం కొట్టుకుపోయింది. మట్టి దిబ్బగా మారిన ఆ నివాసంలో అనేక మంది చనిపోగా.. మాయ మాత్రం బురదలో కూరుకుపోయి సజీవంగా కనిపించారు. నాలుగు గంటలపాటు శ్రమించిన రెస్క్యూ బృందాలు.. ఆమెను సురక్షితంగా కాపాడాయి.