పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ, డీఏల సాధనతో పాటు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో సెప్టెంబర్ నెలలో పలు ఉద్యమ కార్యక్రమాలను చేపట్టాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGCPSEU) నిర్ణయించింది. సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 1ను సీపీఎస్ విద్రోహ దినంగా పాటించాలని జేఏసీ నిర్ణయించిందని తెలిపారు. ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఛైర్మన్ పిలుపునిచ్చారు.