ఆస్ట్రేలియాలో మహిళల క్రికెట్ ఆడేందుకు ట్రాన్స్ క్రికెటర్ అనయా బంగర్‌కు అనుమతి ఇవ్వడాన్ని దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మరిజాన్ కాప్ తీవ్రంగా వ్యతిరేకించింది. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం ‘పూర్తిగా హాస్యాస్పదం’ అని పేర్కొంటూ కాప్ సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే అనయా బంగర్ లింగ మార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారిన ఓ అబ్బాయి. పురుషుడిగా ఉండి లింగ మార్పిడి చేయించుకొని మహిళగా మారిన క్రీడాకారిణులు అంతర్జాతీయ మహిళల క్రికెట్లో పాల్గొనడానికి వీల్లేదు.