ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. తమ సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్తామని, సెప్టెంబర్ రెండో వారం నుంచి రాష్ట్రంలో వర్క్ టు రూల్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు జేఏసీ చైర్మన్ బొప్పరాజు స్పష్టం చేశారు. ఉద్యోగులు రాత్రిపగలు శ్రమించి కూడబెట్టిన నిధులను ప్రభుత్వం తన అవసరాల కోసం దారి మళ్లించి వాడుకుంటోందని,ఈ పరిస్థితికి నిరసనగానే సెప్టెంబర్ రెండో వారం నుంచి విధుల్లో నిర్దేశిత పని గంటల పరిమితిని మాత్రమే పాటిస్తూ నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు.