నేపాల్లో సంభవించిన విపత్తులో త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద సొరంగంలో చిక్కుకున్న వారిలో 350 మందిని నేపాల్ సైన్యం కాపాడింది. వీరిలో 63 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ప్రతికూల వాతావరణం, వేగంగా ప్రవహిస్తోన్న వరద, ప్రమాదకరమైన, సవాళ్లతో కూడిన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ.. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమైనట్లు తెలిపింది. అందులో చిక్కుకుపోయిన మరో 100 మందిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది.