రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.సీఎంను కలిసిన వారిలో మంత్రి సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షురాలు గద్దె అనురాధ, తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత ఉన్నారు.