తెలంగాణలో ప్రభుత్వం తరఫున ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తూ, అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయిస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సందర్భంగా ఆయన మాట్లాడారు. నాంపల్లి, రాజేంద్రనగర్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ ఇళ్లు ఇచ్చామన్న ఆయన, మరో 10 రోజుల్లో రెండో విడత జాబితా విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.