తోబుట్టువుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను దేశవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నారు.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు ప్రధానిని కలిసి ఆయనకు రాఖీలు కట్టారు. చిన్నారులతో మోదీ సరదాగా ముచ్చటించారు. వారితో షేక్‌హ్యాండ్ ఇవ్వడంతో పాటు హైఫైవ్‌లు ఇస్తూ ఉత్సాహంగా గడిపారు. చిన్నారులతో ఆయన ఆత్మీయంగా మాట్లాడిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా రాఖీ వేడుకలు కొనసాగుతున్నాయి.