రక్షాబంధన్ రోజున తోబుట్టువులకు అండగా నిలబడతామని సోదరులు హామీ ఇచ్చినట్టు.. జార్ఖండ్‌లోని గ్రామీణ వాసులు చెట్లకు రాఖీలు కట్టి, తాము ప్రకృతిని నిత్యం పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే వీళ్లు ఒకటి, రెండు కాదు.. ఏకంగా లక్ష చెట్లకు రాఖీలు కడుతున్నారు. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా ఆ రాష్ట్రంలోని దాదాపు 700 గ్రామాల ప్రజలు ఏకమై ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు.30 రోజుల్లో రాష్ట్రంలోని 24 జిల్లాల్లో మూడు లక్షల చెట్లకు పైగా రాఖీలు కట్టాలని లక్ష్యం పెట్టుకున్నట్టు అటవీ సంరక్షణాధికారి తెలిపారు.