పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన సాహిల్ (25), అతని భార్య సమీరా (21)ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 2024-25 మధ్య ఈ దంపతులు ఎనిమిది భారతీయ సిమ్ కార్డులను సేకరించి, వాటిని దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు పంపినట్లు పోలీసులు చెబుతున్నారు.ఆ సిమ్‌లతో పాకిస్థాన్‌లో
వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసి, భారతీయులను సంప్రదించేందుకు ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.