రక్షాబంధన్ వేడుకల సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతమైంది. దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనకు రాఖీ కట్టారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన అనంతరం సీఎంకు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.