హెచ్-1బీ వర్క్ వీసాలపై ప్రతిపాదించిన 1,03,265 డాలర్ల అదనపు రుసుము అమెరికాలోని ఉద్యోగాలను విదేశాలకు తరలించే పరిస్థితి తీసుకురావచ్చని భారతీయ-అమెరికన్ సంస్థ ‘ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్’ (ఫియిడ్స్) ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత భారీ రుసుము వల్ల కంపెనీల చట్టబద్ధమైన నియామకాలు కూడా ఆర్థికంగా భారంగా మారతాయి. ఫలితంగా అధిక విలువ కలిగిన ఉద్యోగాలను అమెరికా వెలుపల ఏర్పాటు చేసేలా సంస్థలను ప్రోత్సహించే ప్రమాదం ఉందని ఫియిడ్స్ పేర్కొంది.