ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది.
వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు స్పిల్వేకు చెందిన మొత్తం 48 గేట్లను ఎత్తి, దిగువకు 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వరద ఉధృతి పెరగడంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండిపోశమ్మ ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఆలయంలోని క్యూ లైన్లు, చుట్టుపక్కల ఉన్న దుకాణాలు పూర్తిగా నీట మునిగిపోయాయి.