సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద బుధవారం (ఆగస్టు 26) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐరన్ రాడ్ల లోడ్‌తో ఉన్న కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.