అమెరికాకు చెందిన భారీ ఎయిర్ఫోర్స్ విమానం రష్యాలో దిగడం ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రవాణా కార్యకలాపాలకు ఉపయోగించే బోయింగ్ సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానం మాస్కోకు సమీపంలోని నుకోవో ఎయిర్పోర్టులో మంగళవారం దిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం, ఆర్సీహెచ్4555, 07-7181 రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న విమానం రష్యా పొరుగుదేశమైన లాట్వియా నుంచి బయలు దేరింది మాస్కోలో మంగళవారం ఉదయం 10.00గలకు ల్యాండైంది. అసలు విమానం రష్యాకు ఎందుకు వెళ్లిందనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు.

