ఐపీఎస్ అధికారి సీఐడీ డీజీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి సంజయ్‌పై సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ ఉల్లంఘనల ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాది జనవరిలో సంజయ్‌ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన పరిధిలో లేకపోయినా రూ. కోటి 20 లక్షల వరకు బినామీ కంపెనీకి చెల్లింపులు చేశారని సంజయ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈయనపై సాధారణ విచారణ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విచారణ అధికారిగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్‌ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

