కృతి సనన్ నటించిన ఓ ప్రకటనపై నటి, ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించడంతో విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది. రక్షా బంధన్ వంటి సాంప్రదాయ పండుగకు సంబంధించిన ప్రకటనలో ఇలాంటి దుస్తులు అవసరమా అంటూ కంగనా రనౌత్ ప్రశ్నించారు. మహిళలకు చీరలు, లెహంగాలు, జీన్స్, ఇతర ఆధునిక దుస్తులు ఇలా ఎన్నో ఎంపికలు ఉన్నప్పటికీ, సోదరుడికి రాఖీ కట్టే సందర్భంలో ఇలాంటి బోల్డ్ అవుట్‌ఫిట్ ఎందుకు ఎంచుకున్నారని ఆమె తన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.