కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాకపోవడం వారిలో ఆందోళన పెంచుతోంది. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, కూటమి మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ జేఏసీ నేతలు ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు. చర్చల పై నిర్ణయాల కాలయాపనకు స్వస్తి చెప్పాలన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో చర్యలు తీసుకోకపోతే ఈ నెల 28న విజయవాడలో జరిగే రాష్ట్ర స్దాయి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.