అనసూయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో దుమారం రేపారు. తరచుగా అనసూయ బోల్డ్ గా మాట్లాడడం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. భర్త మరణిస్తే భార్య గాజులు, బొట్టు ఎందుకు తీసేయాలి అంటూ అనసూయ సూటిగా ప్రశ్నించారు.బొట్టు, గాజులు, గోరింటాకు లాంటి వాటిని పెళ్లితో ఎందుకు ముడిపెట్టారు. అసలు ఈ రూల్ ఎలా వచ్చింది అంటూ అనసూయ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవన్నీ ఆడవాళ్ళ వ్యక్తిగత ఇష్టమైనవి కదా అంటూ అనసూయ ప్రశ్నించింది.