సీజ్ చేసిన ఇసుక డంప్‌నే సాండ్ మాఫియా మాయం చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వేలానికి ముందు రోజే ఇసుకను తరలించడంతో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 19న దుందుభి వాగు సమీపంలోని పట్టా భూమిలో అక్రమంగా డంప్ చేసిన 15,829 క్యూబిక్ మీటర్ల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వేలం వేయాలని ప్రయత్నాలు చేశారు.

