తెలంగాణలో జనసేన పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎన్నికలు ఏవైనా సరే.. ఫలితాలతో సంబంధం లేకుండా పోటీచేస్తూ ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి దిగబోతోంది. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం-నల్లగొండ-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరును పార్టీ ముందస్తుగా ప్రకటించింది.