భారతీయ రైల్వేలకు చెందిన ఏసీ కోచ్ లలో ప్రయాణికులకు అందించే బెడ్స్ దుర్వినియోగం అవుతున్న తీరు ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ముగ్గురు వ్యక్తులు ‘వెస్టర్న్ రైల్వే’ అని స్పష్టంగా రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాలువాల్లా కప్పుకుని మార్కెట్లో ఏమాత్రం సంకోచం లేకుండా షాపింగ్ చేస్తూ కనిపించారు. రైలు ప్రయాణంలో సౌకర్యం కోసం ఇచ్చిన ప్రభుత్వ ఆస్తిని ఇలా బహిరంగంగా వ్యక్తిగత దుస్తులుగా వాడుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.