మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ED సోదాలు ముగిశాయి. సిబిఐ కేసు ఆధారంగా హైదరాబాద్, కడప సహా ఏడు చోట్ల ED తనిఖీలు చేపట్టింది. కేసులోని కీలక నిందితుల నివాసాల్లో సోదాలు జరిగాయి. పలు పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. రూ.24 లక్షల నగదును సీజన్ చేశారు. ఆయనకు చెందిన రెండు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో లభించిన డిజిటల్, ఆర్థిక ఆధారాలపై ఇడి దర్యాప్తు కొనసాగిస్తోంది.