ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగన్ మోహన్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. పీఎస్సార్ ఆంజనేయులు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐపీఎస్ అధికారి. నటి కాదంబరి జెత్వానీని అక్రమంగా అరెస్టు చేయించిన కేసులో ఏపీ ప్రభుత్వం ఆయనను ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఆ కేసులో ఆయన అరెస్టు కూడా అయ్యారు.