కాంగ్రెస్ పార్టీలో కొండా సుస్మిత వ్యాఖ్యల దుమారం చిలికి చిలికి గాలివానగా మారింది. “నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కాదు” అని ఆమె స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన సోదరులను విమర్శించానని తెలిపారు.రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే తనకు గౌరవం ఉందని సుస్మిత అన్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు విపరీతమైన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.